VIDEO: 'బీజేపీ కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి'
కోనసీమ: బీజేపీ చేసే కార్యక్రమాలు ప్రజలలోకి వెళ్ళేలా నాయకులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.