సెల్ ఫోన్‌లను రికవరీ చేసిన పోలీసులు

సెల్ ఫోన్‌లను రికవరీ చేసిన పోలీసులు

NLG: సెల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి CEIR పోర్టల్ ఒక వరం లాంటిదని DSP శివరాం రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న 47 సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా పోలీసులు ట్రేస్ చేసి రికవరీ చేశారు. సోమవారం బాధితులకు DSP ఆ ఫోన్లను అందజేశారు. సెల్ ఫోన్ల ద్వారానే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.