1971 తర్వాత త్రివిధ దళాల మొదటి దాడి ఇదే!

1971లో భారత్-పాక్ యుద్ధం తర్వాత భారత త్రివిధ దళాలు పాక్‌పై దాడి చేయటం ఇదే తొలిసారి. 1971 తర్వాత కార్గిల్ యుద్ధం, పుల్వామా దాడికి ప్రతిగా భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించినా.. అప్పుడు త్రివిధ దళాలు పాల్గొనలేదు. ప్రస్తుతం కేవలం ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.