VIDEO: కోటి సంతకాల సేకరణ విజయవంతం
అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని వైసీపీ సమన్వయకర్త నిషార్ అహమ్మద్ మంగళవారం తెలిపారు. ప్రజలు కుల, మతాలకు అతీతంగా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. బుధవారం బెంగుళూరు బస్టాండు వైసీపీ ఆఫీసు వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం సంతకాల ప్రతులను రాయచోటికి తరలించి, అక్కడి నుండి విజయవాడకు పంపనున్నట్లు తెలిపారు.