షెడ్యూల్ కులముల బాలికల వసతి గృహంపై ACB దాడులు

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహంపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బాలికల మధ్యాహ్న భోజనం బియ్యంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాడులు చేస్తున్నారు. నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నారు.