పనికి వెళ్లమన్నారని యువకుడు ఆత్మహత్య..!

పనికి వెళ్లమన్నారని యువకుడు ఆత్మహత్య..!

NGKL: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌కు చెందిన కుంభం విగ్నేశ్(20)‌ను ఖాళీగా ఉండే బదులు పొలం పనులకు వెళ్లాలని తండ్రి గదమాయించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం HYDకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.