సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
MDK: మనోహరాబాద్ మండలం పరికిబండ, తుపాకులపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు మంచ శ్రీరామ్ అందజేశారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గాంతి నర్సింలు, చాపల బాబు, విఠల సుమన్‌లకు రూ. 1.03 లక్షల చెక్కులు మంజూరయ్యాయి.