జిల్లాలో RTCలో 13 నుంచి ఇంటర్వ్యూలు

NLR: RTCలో అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ వి. శ్రీధర్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 13వ తేదీ, నెల్లూరుకు 14వ తేదీ, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు 15వ తేదీ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నాయి.