తీగలగుట్టపల్లిలో ఘనంగా ఛత్ పూజ పండగ

తీగలగుట్టపల్లిలో ఘనంగా ఛత్ పూజ పండగ

కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి 2వ డివిజన్‌లో మంగళవారం ఉత్తరప్రదేశ్ సోదర సోదరీమణులు ఛత్ పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తీగలగుట్టపల్లి డివిజన్‌లోని బతుకమ్మ కుంట వద్ద ఈ పూజ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ కోలగాని శ్రీనివాస్, ఉత్తరప్రదేశ్ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.