ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్, ఉప సర్పంచ్

ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్, ఉప సర్పంచ్

BDK: గ్రామపంచాయతీ పరిధిలో మంచి సుపరిపాలన అందించాలని ఎమ్మెల్యే పాయం సూచించారు. మణుగూరు మండలంలోని ప్రజా భవన్‌లో ఎమ్మెల్యేను శుక్రవారం సమితి సింగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచ్ మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఇరువురిని అభినందించి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.