తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి

తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి

కర్నూలు: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చాలని మహిళలు ఆదివారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కోరారు. గుక్కెడు మంచినీళ్లు కోసం పలు ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే ముందు వాపోయారు. ఎన్నికలు అయిన మరుక్షణమే తాగునీటి నీటి పైపులైన్ వేసి తప్పకుండా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.