అదనపు గదుల నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన సబ్ కలెక్టర్

అదనపు గదుల నిర్మాణానికి  స్థల పరిశీలన జరిపిన సబ్ కలెక్టర్

SRD: సిర్గాపూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, DSP వెంకట్ రెడ్డి గురువారం సందర్శించారు. పాఠశాలకు పీఎం శ్రీ పథకం కింద మంజూరైన సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదుల నిర్మాణానికి పాఠశాల పక్కన ఉన్న ప్రభుత్వ మిగులు భూమిని వారు స్థల పరిశీలన చేశారు. ఇందులో తహశీల్దార్ కిరణ్ కుమార్, MEO నాగారం శ్రీనివాస్, SI మహేష్, MRI ఉన్నారు.