దుబ్బాకలో రైతుల ధర్నా

దుబ్బాకలో రైతుల ధర్నా

SDPT: దుబ్బాక మండలంలో రైతులకు యూరియా పంపిణీ చేయడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహించారు. యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ దుబ్బాకలో బుధవారం శివాజీ చౌరస్తా వద్ద వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ అధికారి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.