VIDEO: శివలింగానికి అభిషేకాలు

WNP: కొత్తకోట మండలం కానాయిపల్లి సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్త ఆలయంలో శనివారం సాయంత్రం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరంలోని నవరత్నాలంకృత పాదరససహిత స్వర్ణకవచ పంచలోహ శివలింగానికి భక్తులు అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో మహా మంగళహారతి సమర్పించారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.