'లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదు'

ఖమ్మం: జిల్లాలో లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గురువారం సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు రుణమాఫీ ప్రక్రియ పూర్తియినట్లుగా ప్రకటన చేయటం రైతులను మభ్య పెట్టేందుకేనని ఆయన పేర్కొన్నారు.