నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్
E.G: గోకవరం సబ్‌స్టేషన్ పరిధిలో కొత్త లైన్ల ఏర్పాటు కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE నటరాజ్ తెలిపారు. అచ్చుతాపురం, గుమ్మలదొడ్డి, బావాజీపేట, వెదురుపాక గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. 33-KV కొత్త లైన్ల పనులు, మరమ్మతుల నిమిత్తం ఈ కోత విధిస్తున్నట్లు వివరించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.