కలవకొండ ఆదిలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు

TPT: చిల్లకూరు మండలంలోని కలవకొండ కొండపై గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శ్రావణమాస చివరి శుక్రవారం ఆదిలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ మేరకు సహస్రనామ పారాయణం చేసి, కుంకుమార్చన చేశారు. అనంతరం మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంకాలం అమ్మవారికి పల్లకి సేవ ఉత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలియచేశారు.