హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

చిత్తూరు: కుప్పం, కాణిపాకం జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం, హోసూర్, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే, కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్డు NH-140 సంబంధించి కనెక్టివిటీ అంశాన్ని కేంద్రానికి సమర్పించగా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ రహదారి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.