అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం

SRPT: తిరుమలగిరి మండలం కొంపెల్లి గ్రామంలో గ్రామానికి చెందిన సంధ్యకు బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ రమేష్ అంబులెన్స్ లోనే సుఖప్రసవం చేశారు. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని, సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.