'నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలి'

'నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలి'

NLG: ''ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'' అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నల్గొండలోని ఉదయాదిత్య భవన్‌లో ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పథకాలను పేద ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు.