గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా స్వేరోస్ సంఘం నాయకులు

GDWL: రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడలో ఈనెల 20వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా శనివారం గోడపత్రికను జిల్లా స్వేరోస్ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.