VIDEO: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు.. తనిఖీలు
WGL: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ సుబేదారి ఇన్స్‌పెక్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజల్ టీమ్ కోర్టు ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని పోలీసులు తెలిపారు.