రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

కాకినాడ: సామర్లకోట మండలం జి. మేడపాడులో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. బాధితులను సామర్లకోట, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.