బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి

బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి

SRPT: కోదాడ పట్టణ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో హైస్కూల్ ఎదురుగా ఉన్న జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, మాజీ సర్పంచ్ పయిడిమర్రి సత్యబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.