రైల్వే గేటు వద్ద అగ్ని ప్రమాదం
ఏలూరులోని పవర్‌పేట రైల్వే గేటు వద్ద శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్టు పడవేయడం ద్వారా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్నారు. విద్యుత్ నిలుపుదల చేసి ఎటువంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకున్నారు.