బుడమేరు కాలువలో గుర్తు తెలియని మృతదేహం

NTR: ఇబ్రహీంపట్నం మండలంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం బుడమేరు కాలువలో లభ్యమైనది. స్థానికులు కలిసిన వివరాల ప్రకారం.. ఈలప్రోలు గ్రామ వద్ద ఉన్న బుడమేరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం కనిపించిందన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించామన్నారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించమన్నారు.