'తల్లి పాలు శిశువులో రోగ నిరోధక శక్తి పెంచుతాయి'

KRNL: తల్లి పాలు శిశువులో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని ఎంపీడీవో ప్రభావతి దేవి స్పష్టం చేశారు. తల్లి పాలు వారోత్సవాలలో భాగంగా పెద్దకడబూరులో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయకుమారి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలింతలు, గర్భిణీలకు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. శిశువు పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టించాలని కోరారు.