ఈనెల 20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

ఈనెల 20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

ప్రకాశం: ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి అన్నారు. మంగళవారం పామూరులో అంగన్వాడీ  కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సూపర్వైజర్ పద్మకి సమ్మె నోటు అందజేశారు.