హరీశ్ రావు వ్యాఖ్యలపై నర్సారెడ్డి ఫైర్

SDPT: సీఎం రేవంత్ రెడ్డి గజ్వేల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌పై నిజంగా ఎవరు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందో స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.