అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఐదు వార్డులు ఏకగ్రీవం

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఐదు వార్డులు ఏకగ్రీవం

RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి నాలుగు గ్రామాల్లోని ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కవాడిపల్లి 1వ వార్డు, లష్కర్‌గూడ 7, 8వ వార్డులు, ఇనాంగూడ 6వ వార్డు, గుంతపల్లి 8వ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఈ మండలంలో మూడవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.