మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు: మంత్రి సీతక్క

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు: మంత్రి సీతక్క

MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 251 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేస్తోందని శుక్రవారం రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ఆలయ ప్రాంగణ పునరుద్ధరణతో పాటు భక్తుల భద్రతకు అత్యాధునిక సాంకేతికతతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 18వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా గద్దెల పునరుద్ధరణ ప్రారంభమవుతుందని తెలిపారు.