తాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరిశీలించిన ఏఈ

తాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరిశీలించిన ఏఈ

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్ ప్రాంతంలో ప్రజలకు సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్ శాతాన్ని మున్సిపల్ మంచినీటి విభాగం ఏఈ గణపతి రావు సోమవారం పరిశీలించారు. తాగునీటిలో ఉండాల్సిన పరిణామంలోనే(1.00 పీపీఎం)క్లోరిన్ ఉన్నట్లు తెలిపారు. నివేదికను రాష్ట్ర పట్టణ మున్సిపల్ శాఖ అధికారులకు పంపిస్తామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు