VIDEO: బాంబుల మోతతో దద్దరిల్లుతున్న తండా

WGL: :పర్వతగిరి మండలం గుగులోత్ తండా గ్రామపంచాయతీకి సమీపంలో ఉన్న క్రషర్‌లో బాంబుల మోతతో తండావాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హెవీ బాంబులను ఉపయోగించడం వల్ల తండాలో ఇటీవల నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు పలువురి ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. సోమవారం తండా వాసులు మాట్లాడుతూ.. క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.