ఉత్సాహంగా నేవీ మార‌థాన్‌

ఉత్సాహంగా నేవీ మార‌థాన్‌

VSP: విశాఖపట్నం బీచ్ రోడ్‌లో ఆదివారం తెల్లవారుజాము నుంచి నేవీ మారథాన్ ఉత్సాహంగా జరిగింది. 42K, 21K, 10K, 5K విభాగాలతో పాటు దివ్యాంగుల కోసం ‘సంకల్ప్ రన్’ నిర్వహించారు. ఫుల్ మారథాన్‌ను ఈస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ సంజయ్, 10K రన్నును జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రారంభించారు. నేవీ సిబ్బంది, స్థానిక క్రీడాకారులు, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.