మూడోసారి కస్టడీకి డ్రగ్స్ కేసు నిందితులు!
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు మూడోసారి కస్టడీకి కోరారు. ఆర్థిక సంబంధాలపై లోతుగా విచారించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు నిందితులను పోలీసులు కస్టడీలో ప్రశ్నించారు. ఇవాళ ఉప్పరిపల్లి కోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్నారు.