3,665వ రోజుకు చేరిన స్వచ్ఛ సుందర చల్లపల్లి

3,665వ రోజుకు చేరిన స్వచ్ఛ సుందర చల్లపల్లి

కృష్ణా: ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం విడిచి పెట్టాలని విశ్రాంత వైద్యులు డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణ కోరారు. గురువారం చల్లపల్లిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి 3,665వ రోజు కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ కార్యకర్తలు బస్టాండ్ ప్రాంగణం, ప్రధాన రహదారి, కోట ఎదుట పరిసరాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థములను డంపింగ్ యార్డుకు తరలించారు.