ఘనంగా మల్లికార్జున స్వామి వార్షిక కళ్యాణోత్సవం

ఘనంగా మల్లికార్జున స్వామి వార్షిక కళ్యాణోత్సవం

MHBD: మరిపెడ మండలం ఉల్లేపల్లె గ్రామంలో మల్లికార్జున స్వామివార్షిక కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ నిర్వాహకులు రామడుగు వంశీకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.