VIDEO: తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి
NLG: నల్గొండ జిల్లా ఆర్జాలభావి PACS కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పరిశీలించారు. రైతు సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ “ప్రభుత్వం చేతకానితనం, ప్రకృతి ప్రహారం వల్ల రైతులు కష్టాల్లో ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనాలి. లేకపోతే BRS ఉద్యమం చేపడుతుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.