CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద 56మందికి రూ. 56 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు 22 విడతలుగా ఈ సహాయం అందించామని, గత 20 నెలల్లో 743 మందికి రూ. 7.83 కోట్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.