రాష్ట్రస్థాయిలో విజేతగా ఉమ్మడి జిల్లా జట్టు

రాష్ట్రస్థాయిలో విజేతగా ఉమ్మడి జిల్లా జట్టు

MNCL: మందమర్రి సింగరేణి మైదానంలో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఫైనల్స్‌లో రంగారెడ్డి జిల్లా జట్టుపై ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు గెలుపొంది గోల్డ్ మెడల్ సాధించింది. అనంతరం గెలుపొందిన జట్లకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, కనపర్తి రమేష్, కాంపల్లి సమ్మయ్య బహుమతులు ప్రధానం చేశారు.