రేపు సిరివెళ్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
NDL: రేపు సిరివెళ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు తెలియజేయాలని వారు కోరారు.