గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

WGL: ఎనుమాముల పోలీసులకు అందిన సమాచారం మేరకు, ఆరెపల్లిలోని ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వద్ద గంజాయి విక్రయిస్తున్న నయీంనగర్‌కు చెందిన విఘ్నేష్ అనే యువకుడిని బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్ సురేశ్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి.