VIDEO: కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఇబ్బందులు
MDK: రామాయంపేట మండలం కాట్రియాల ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా సుమారు 3,500 బస్తాల ధాన్యం నిలువ ఉందని, లారీలు రాకపోవడం వల్ల ధాన్యం అక్కడే నిలిచిపోయిందని తెలిపారు. అధికారులు స్పందించి లారీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.