VIDEO: వర్షం భయంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆందోళన
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో వరి కోతలు జోరుగా సాగుతుండగా, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఆకాశం మేఘావృతంగా ఉండటంతో ఎప్పుడు వర్షం పడుతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మండలంలో సుమారు 19వేల ఎకరాల్లో వరి సాగు జరగగా, దాదాపు 4లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరగా కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.