ఆడెల్లి అమ్మవారికి వెండి కిరీటం బహుకరణ
NRML: నూతనంగా ప్రతిష్టించబడిన ఆడేల్లి అమ్మ వారి విగ్రహానికి చింతాకుల రాజేశ్వర్ గౌడ్ వారి కుమార్తెలు అల్లుళ్లు శ్రీలత వెంకటేష్ గౌడ్, సుమలత శ్రీనివాస్, ప్రేమలత శరత్ గౌడ్‌లు వెండి కిరీటాన్ని ఆలయ చైర్మన్ భోజగౌడ్, ఈవో భూమన్న సమక్షంలో బహుకరించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుచరిత రాజేశ్వర్ రావు తదితరులున్నారు.