PPP మోడల్‌లో ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ది
కృష్ణా: విజయవాడ ఆటోనగర్ బస్టాండ్‌కు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 10 ప్లాట్‌ఫామ్స్, వ్యాపార సముదాయాలు ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. అనుమతులు రాగానే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. ఉయ్యూరు, గుడివాడ బస్టాండ్‌ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి