అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
Pdpl: సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్‌లో సాయిరి మహేందర్, పద్మల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు తన సతీమణి పావనితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వామికి క్షీరాభిషేకం చేశారు.