VIDEO: ద్రాక్షారామలో పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం
కోనసీమ: ద్రాక్షారామలో కొర్ల బాబీ ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి గృహోపకరణాలు, ఫ్రిడ్జ్, టీవీ ధ్వంసమయ్యాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెవెన్యూ, ఫైర్ అధికారులు నష్టాన్ని పరిశీలించి నివేదిక సేకరించారు. గ్యాస్ కంపెనీ ప్రతినిధి ప్రమాద స్థలాన్ని తనిఖీ చేసి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం సిఫార్సు చేశారు.