ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

NZB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ లో జరిగింది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. గంగాధర్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఎక్సెల్ వాహనం పైన వెళ్తుండగా క్లాక్ టవర్ వద్ద ఓ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొంది. బలమైన గాయాలు కావడంతో గంగాధర్ అక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.