'శవ రాజకీయాలు వైసీపీ DNA లోనే ఉన్నాయి'
VZM: శవ రాజకీయాలు వైసీపీ డీఎన్ఏలోనే ఉన్నాయని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. లక్కవరపుకోట, టీడీపీ కార్యాలయం నందు కూటమి పార్టీల నాయకులతో కలిసి ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట నిజంగా దురదృష్టకరమని, తుఫాన్‌లో శవాలు దొరకలేదని పాపం వైసీపీ అధినేతకు దిగులు పట్టుకుందని తెలిపారు.